![]() |
![]() |
.webp)
సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని.. అనేది 90's వెబ్ సిరీస్ తో ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో ఈ సాంగ్ కి రీల్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆ రెండు లివర్ లు ఎక్స్ ట్రా కుమారీ అంటీ, ఈ సాంప్రదాయని సుప్పినీ, కుర్చీ మడతబెట్టి ఇవన్నీ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండింగ్ లోకి ' బ్రహ్మముడి' సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు చేరింది.
స్డార్ మా టీవీలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో కనకం-కృష్ణమూర్తిల కుమార్తెగా కావ్య చేస్తోంది. దుగ్గిరాల ఇండి వారసుడు అపర్ణ సుభాష్ ల కొడుకు రాజ్ ని పెళ్ళి చేసుకున్న కావ్య.. ఎంతో అనుకువగా ఉంటూ అందరి మనసులు దోచేస్తోంది. అయితే కొత్త కోడలు అనామిక రావడంతో కావ్యది ఏం తప్పులేకపోయిన అప్పు ప్రేమ వల్ల తనని ధాన్యలక్ష్మి పూర్తిగా అపార్థం చేసుకుంది. దాంతో కథలో కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రాజ్ తన ఫ్రెండ్ శ్వేతని ప్రేమిస్తున్నాడని కావ్య అపార్థం చేసుకొని అతడినే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఇదే అదునుగా భావించిన రాజ్.. కావ్యని నానారకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే శ్వేత మాత్రం నిజం చెప్పాలనే ప్రయత్నిస్తుంది. మరి రాజ్, కావ్యల మధ్య అపార్థాలు తొలగిపోయి మళ్ళీ కలుస్తారా లేదా అనే క్యూరియాసిటితో ఈ సీరియల్ సాగుతోంది.
అయితే సీరియల్ లో సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా కన్పించే కావ్య అలియాస్ దీపిక రంగరాజు.. బయట మాస్ ఊరమాస్ అంటుంది. ఆదివారం విత్ స్డార్ మా పరివారం షోలో రాజ్ తో కలిసి కావ్య చేసిన సెటైరికల్ పేరడి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. బయట చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా తను ఓ సినిమాకి వెళ్లి.. అందులో పాప్ కార్న్ తింటూ ఓ వీడియో చేసింది. ఇక్కడివరకు బానే ఉంది. కానీ తను రెండు విధాలుగా తింది. ఎవరైన మనం పాప్ కార్న్ తింటున్నప్పుడు ఎలా తినాలో.. ఎవరూ చూడనప్పుడు ఎలా తినాలో చేసి చూపించింది. అయితే ఈ వీడియోకి సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని పాట ఆడ్ చేయడంతో సూపర్ సెట్ అయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరు సీరియల్ లో కంటే బయటే బాగుంటారు. మీరు ఇలా ఒరిజినల్ గా ఉంటేనే నచ్చుతారని, సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
![]() |
![]() |